ఈ నెల 26న కార్గిల్ విజయ్దివస్ సందర్భంగా... విశాఖలో నౌకాదళ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో సైన్యం చూపిన పాటవం ఎప్పటికీ స్పూర్తిదాయకమేనని నినదించారు. 2వేల మందికిపైగా నౌకాదళ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ సర్కార్స్ నుంచి ఆరంభమైన ర్యాలీని... వైస్అడ్మిరల్ ఏకేజైన్ ప్రారంభించారు. డాల్ఫిన్ హిల్రోడ్ వరకు 6కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగింది. జూలై 13న కార్గిల్ యుద్ధం ఆరంభమై 26 వరకు సాగిందని... 2వారాలపాటు సైన్యం, రక్షణ దళాలుపై ప్రజలకు అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూర్పునౌకాదళం అధికారులు వెల్లడించారు. కార్గిల్ యుద్ధం జరిగి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా... విజయ్దివస్ను ఈనెల 26 వరకు నిర్వహించనున్నారు.
సాగరతీరంలో 'విజయ్దివస్' ర్యాలీ - indian army
జులై 26న కార్గిల్ విజయ్దివస్ సందర్భంగా... విశాఖలో నౌకాదళ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వైస్అడ్మిరల్ ఏకేజైన్ దీనిని ప్రారంభించారు
విజయ్దివస్ ర్యాలీ