ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దేశమంతా ఒకటే స్వరం.. కశ్మీర్ మనదే'

'భారత్ ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోదు. కానీ.. మన జోలికి వస్తే సరైన సమాధానం చెప్పగల ధైర్యం, నేర్పు మనకి ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. కశ్మీర్ భారత్​లో అంతర్భాగం.' -- వెంకయ్యనాయుడు

'దేశమంతా ఒకటే స్వరం.. కశ్మీర్ మనదే'

By

Published : Aug 28, 2019, 12:04 PM IST

Updated : Aug 28, 2019, 2:52 PM IST

విశాఖలో ఎన్ఎస్​టీఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'గోల్డెన్ జర్నీ' పేరిట ఫొటో ఆల్బమ్ విడుదల చేశారు. 8 మంది శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. న్యూక్లియర్ సబ్ మెరైన్ వృద్ధి చేసుకున్న కొద్ది దేశాల్లో మనం ఉండటం అద్వితీయమన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ఉద్ఘాటించారు. మనం ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోమనీ.. మన జోలికి ఎవరైనా వస్తే సరైన సమాధామిచ్చామని తెలిపారు. పొరుగు దేశం ప్రోద్బలం వల్ల వచ్చే ఇబ్బందులను సమర్థంగా తిప్పికొట్టగలమన్నారు. కశ్మీర్ భారత్​లో అంతర్భాగమనీ.. దీనికోసమే అధికరణం 370 రద్దు జరగిందన్నారు. ఇదే అంశాన్ని దేశమంతా ఒకే స్వరంతో చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

'దేశమంతా ఒకటే స్వరం.. కశ్మీర్ మనదే'

Last Updated : Aug 28, 2019, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details