కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు వస్తున్నవారికి విశాఖ కెమిస్ట్స్ సొసైటీ సభ్యులు బాసటగా నిలుస్తున్నారు. విశాఖ కెమిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బగ్గాం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నవారికి మాస్క్ లు, ఫేస్ షీల్డులు, శానిటైజర్లను అందిస్తున్నారు. అంతేకాకుండా హోం ఐసోలేషన్ ఉండాలనుకునే వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. విశాఖ జిల్లాలో ఉన్న అన్ని సీఎం ఆరోగ్య కేంద్రాల వద్ద ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గడ్డు కాలంలో మానవత్వం చాటుతున్నారు - vishakapatnam latest news
కరోనా సమయంలో మానవత్వం చాటుతున్నారు విశాఖ కెమిస్ట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. కొవిడ్ పరీక్షలకు వచ్చే వారికి మాస్క్ లు, ఫేస్ షీల్డులు, శానిటైజర్లను అందిస్తున్నారు. అంతేకాకుండా కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చినవారు హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు కావాల్సిన మందులను ఉచితంగా అందజేస్తున్నారు.
vcda
లాక్ డౌన్ సమయంలోనూ ఎంతోమంది పేదలకు, వలస కూలీలకు సాయం చేసినట్లు బగ్గాం శ్రీనివాసరావు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులకు సాయం అందించడంలోనూ చొరవ చూపామని చెప్పారు.