విశాఖ తీరంలో లంగరు వేసిన అమెరికా యుద్ధనౌక జర్మన్ టౌన్ ఇరుదేశాల సంయుక్త విన్యాసాలు టైగర్ ట్రయంఫ్ కార్యకలాపాల్లో ఉద్ధృతంగా పాల్గొంటోంది. 64 యుద్ధ ట్యాంకర్లు, 50 వరకూ జీపులు లాంటి వాహనాలు, 850 మంది సైనికులతో సహా సాగర జలాల్లో పరుగులు తీయగల సామర్థ్యం ఈ నౌక సొంతం. క్షిపణి ప్రయోగ ఏర్పాట్లు, 280 డిగ్రీల వలయంలో తిరిగే ఆటోమేటిక్ గన్‌లు, నావిగేషన్, రాడార్ సదుపాయాలతో దుర్బేద్ధ్యంగా ఈ నౌకను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత నావికా సిబ్బంది ఈ నౌకను సందర్శించి, ప్రత్యేకతలను ఆకళింపు చేసుకునే విధంగా పలు కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి కూర్మరాజు జర్మన్ టౌన్ యుద్ధనౌక ప్రత్యేకతలు వివరిస్తారు.
విశాఖలో టైగర్ ట్రయంఫ్ సందడి
విశాఖ తీరంలో అమెరికా యుద్ధనౌక జర్మన్ టౌన్ లంగరు వేసింది. టైగర్ ట్రయంఫ్ కార్యకలాపాలతో నౌకలో సందడి నెలకొంది. ప్రస్తుతం భారత నావికా సిబ్బంది ఈ నౌకను సందర్శించి, ప్రత్యేకతలను ఆకళింపు చేసుకునే విధంగా పలు కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు.
us-german-towen-warship