Union Minister Muraleedharan: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రమంత్రి మురళీధరన్ హితవు పలికారు. లోక్‌సభ ప్రవాసీ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి విశాఖలో పర్యటించారు. పక్క దేశాల్లో అప్పు పెరిగితే ఏ రకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో గమనించాలని కేంద్రమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ రుణం తీసుకుంటున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు కూడా ఇది వ్యతిరేకమని వివరించారు. ప్రభుత్వం రూల్ ఆఫ్ లాను పాటించాలని చెప్పారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం వల్ల తిరిగి అవి చెల్లించడం చాలా కష్టసాధ్యమైన పని అని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఎందుకంటే అది ప్రజల డబ్బని, జగన్ డబ్బులు కావన్నది గ్రహించాలన్నారు.
ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు చేయడం సరికాదన్న కేంద్రమంత్రి - విశాఖ తాజా వార్తలు
Union Minister Muraleedharan ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి ఇష్టం వచ్చిట్లు అప్పులు చేయడం సరికాదని కేంద్రమంత్రి మురళీధరన్ అన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోవడం, లంచాలిస్తే క్రమబద్ధీకరించే సంస్కృతి రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇవన్నీ నిజంగానే ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుంటే విచారణ నిర్వహించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రతిదానికి ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం సరికాదన్నారు. దేశంలో ప్రతి చోట కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. మూడేళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని, ఈ ప్రభుత్వ హయాంలో విశాఖలో భూకబ్జాల సంస్కృతి, కమిషన్లు, లంచాలు ముట్టజెప్పితే భూములను క్రమబద్ధీకరిస్తామనడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇది చాలా సిగ్గుచేటని, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితే ఈ రకమైన ఫిర్యాదులపైన విమర్శలపైన వెంటనే విచారణ నిర్వహించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: