Mini Buses: తెలంగాణ దివ్యక్షేత్రం యాదాద్రికి ప్రజారవాణా సౌకర్యం మెరుగుపరచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు బస్సులు నడిపిస్తున్నామని చెప్పారు. ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని సజ్జనార్ వెల్లడించారు.
యాదాద్రికి ప్రత్యేకంగా 100 మినీబస్సులు..! - tsrtc arrenged 100 mini busses
Mini Buses: తెలంగాణ యాదాద్రిలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు బస్సులు నడిపిస్తున్నారు. ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
ఛార్జీలు జేబీఎస్ నుంచి 100 రూపాయలు... ఉప్పల్ నుంచి 75 రూపాయలుగా నిర్ణయించారు. ఇతర జిల్లాల నుంచి కూడా నారసింహుడి క్షేత్రానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని సజ్జనార్ వివరించారు. ఈనెల 28న సాయంత్రం నుంచి నవ వైకుంఠం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దర్శనాలు అందుబాటులోకి వచ్చాయి. గర్భాలయ దర్శనాలు కల్పిస్తున్నారు. ఆరేళ్ల తర్వాత పునఃప్రారంభమైన యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు.
ఇదీచూడండి:Ugadi In Srisailam: ఉగాది మహోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల మహాక్షేత్రం.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు