ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

By

Published : Nov 9, 2021, 9:02 PM IST

TOP NEWS
TOP NEWS

  • ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో జగన్ భేటీ.. వివాదాలపై కీలక నిర్ణయం
    ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం భువనేశ్వర్‌ చేరుకున్న జగన్‌... భువనేశ్వర్‌లో నవీన్‌ పట్నాయక్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఉభయ రాష్ట్రాల మధ్య కీలక అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టిస్తున్నారు: చంద్రబాబు
    ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తొమ్మిదో రోజు మహా పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం
    అమరావతి రైతుల 'న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్ర తొమ్మిదో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఇంకొల్లు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. దుద్దుకూరు వరకు సాగింది. రాత్రికి స్థానిక కల్యాణమండపంలో రైతులు బసచేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. భాజపా నేతలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్
    భాజపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. జగన్ మేక, నక్క కాదని.. పులివెందుల పులి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మోదీకి రెండో స్థానం
    ట్విట్టర్​లో 2021గానూ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు మోదీ. టీమ్​ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ 35వ స్థానం దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆ చట్టాలను రద్దు చేయకపోతే..' కేంద్రానికి టికాయిత్​ అల్టిమేటం
    సాగు చట్టాలను రద్దు చేయకపోతే రైతుల నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ కేంద్రాన్ని హెచ్చరించారు. త్వరలో లఖ్​నవూలో జరిగబోయే కిసాన్ మహాపంచాయత్ 'చరిత్రాత్మకం' అవుతుందని ట్విట్టర్‌లో ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాక్​తో కలిసి చైనా కుట్ర- అధునాతన యుద్ధనౌకతో..
    అత్యంత అధునాతన యుద్ధనౌకను పాకిస్థాన్​కు చైనా సరఫరా చేసింది. విదేశాలకు చైనా ఇలాంటి యుద్ధనౌకను ఎగుమతి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ట్విట్టర్​ పోల్​కే 'మస్క్'​ సై- టెస్లా వాటా విక్రయానికి సిద్ధం
    టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన హోల్డింగ్స్‌లో 10 శాతం వాటాను విక్రయించడానికి సిద్ధమయ్యారు. ట్విట్టర్‌ పోల్‌లో అత్యధిక శాతం మంది వాటాలు విక్రయించమనే సూచించడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రోహిత్​కే టీ20 పగ్గాలు.. సిరీస్​కు కోహ్లీ దూరం
    న్యూజిలాండ్​తో సిరీస్​ నేపథ్యంలో టీ20 జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్​ శర్మ సారథ్యంలో టీమ్​ఇండియా కివీస్​​తో తలపడనుంది. కేఎల్​ రాహుల్​ను వైస్​ కెప్టెన్​గా ఎంపిక చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్‌.. అవార్డు అందుకున్న చరణ్‌
    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్‌ అవార్డు వరించింది. ఎస్పీబీ తరఫున ఆయన తనయుడు చరణ్‌ మంగళవారం ఈ అవార్డుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా స్వీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details