ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇవాళ విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటన - ap local polls 2021

సాధారణ పద్ధతిలో, ప్రజామోదంతో జరిగే ఏకగ్రీవాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునరుద్ఘాటించారు. అసాధారణ పద్ధతిలో, బలవంతంగా ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నాలు... రాజ్యాంగ సమ్మతం కానందునే అంగీకరించమని చెబుతున్నామన్నారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రమేశ్‌కుమార్‌.. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటించనున్నారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌
ap sec tour in visakha and godavari districts

By

Published : Feb 2, 2021, 3:11 AM IST

అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశం దక్కినప్పుడే ప్రజాస్వామ్య గొప్పతనం ఇనుమడిస్తుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. అందుకే అందరూ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపిస్తున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల నిర్వహణపై.... కలెక్టర్లు, ఎస్పీ, ఇతర అధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు బాగా చేశారంటూ అధికారులను అభినందించారు. ఇదే సమయంలో ఏకగ్రీవాలపై మరోసారి స్పష్టతనిచ్చిన ఆయన.. సమాజంలో ప్రజాస్యామ్యం బలపడాలంటే అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. అలా కాకుండా బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం తిరోగమిస్తుందని చెప్పారు. దీనిని అర్థం చేసుకోకుండా అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పరస్పర ఫిర్యాదులు...

అంతకుముందు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఎస్ఈసీని ఆ జిల్లాకు చెందిన తెలుగుదేశం, వైకాపా నేతలు కలిశారు. నామినేషన్ల సందర్భంగా ఆదివారం నిమ్మాడలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. ఇవాళ విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఇదీ చదవండి

సిద్ధార్థ దేవేందర్‌ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details