ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా సామాజిక మాధ్యమాలపై టీఎన్​ఎస్​ఎఫ్ ఫిర్యాదు - ycp Social Media

విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల సేన పేరిట ఉన్న ఫేస్​బుక్ పేజీలో... తెదేపా ఎమ్మెల్యేపై చేసిన పోస్టింగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీఎన్​ఎస్​ఎఫ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైకాపా సామాజిక మాధ్యమాలపై టీఎన్​ఎస్​ఎఫ్ ఫిర్యాదు

By

Published : Aug 28, 2019, 12:56 AM IST

వైకాపా సామాజిక మాధ్యమాలపై టీఎన్​ఎస్​ఎఫ్ ఫిర్యాదు

వైకాపా నేతలు ఫేస్​బుక్ వేదికగా చేస్తున్న అసత్య ప్రచారంపై విశాఖ జిల్లా తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు మూడో పట్టణ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల సేన పేరిట ఉన్న ఫేస్​బుక్ పేజీలో... ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై ఇష్టానుసారంగా సందేశాలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని... ప్రజాప్రతినిధిపై ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతల సామాజిక మాధ్యమాలపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details