మోదీ పర్యటనను నిరసిస్తూ విద్యార్థి సమాఖ్య ఆందోళనలు రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖలో పర్యటించే హక్కు లేదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆంధ్ర యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట నిరసన చేశారు. మోదీ చిత్రపటాలను చేతపట్టి గో బ్యాక్ అంటూనినాదాలు చేశారు.ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించటంలో లొసుగులు ఉన్నాయని... లాభాలు వచ్చే కేకే లైన్ ను రాయగడ కు అప్పగించి, నష్టాల్లో ఉండే లైన్లతో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంపై ప్రేమ ఉంటే విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ గేటు మందు మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.