ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తాండవ జలాశయం.. ప్రకృతి అందాల ప్రపంచం - తాండవ జలాశయం తాజా వార్తలు

తాండవ జలాశయం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా మారిన ఈ జలాశయం చుట్టూ.. పచ్చని పర్వత శ్రేణులు మనసు దోచేస్తున్నాయి. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. సరుగుడు జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

thandava-jalasayam

By

Published : Nov 6, 2019, 1:45 PM IST

కనువిందు చేస్తున్న తాండవ జలాశయం

విశాఖ జిల్లాలో తాండవ జలాశయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం చుట్టూ ఉన్న పచ్చని పర్వత శ్రేణులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడికి ఘాట్‌ రోడ్డులో ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తోంది. పక్కనే ఉన్న సరుగుడు జలపాతం ఈ ప్రాంతానికి మరింత సొగసును తీసుకువస్తోంది. సమీపంలోని నల్లగొండమ్మ దేవాలయం, పూల మెుక్కల పార్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్తీక మాసంలో ఇక్కడికి పర్యటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details