ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా..? మాట్లాడకూడదా?: కేటీఆర్‌ - visakha Steel Plant

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విశాఖ ఉక్కుపై మరోసారి స్పందించారు. ఏపీలో విషయం మాకెందుకని నోరు మూసుకుని కూర్చోబోమని స్పష్టం చేశారు. మనం మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలని కేటీఆర్‌ కోరారు.

కేటీఆర్‌
కేటీఆర్‌

By

Published : Mar 12, 2021, 3:41 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మరోసారి స్పందించారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు అంశం నీకెందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని.. ఆంధ్రప్రదేశ్‌ విషయాలు నీకేందుకుని అంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో లేదా..? మాట్లాడకూడదా?.. అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ దేశంలో మాకు భాగస్వామ్యం లేదా..? మాకు నోరు లేదా..? అని వ్యాఖ్యానించారు.

ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్ముతున్నారన్న తెలంగాణ మంత్రి కేటీఆర్... రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విషయం మాకెందుకని నోరు మూసుకుని కూర్చోబోమని స్పష్టం చేశారు. రేపు తెలంగాణకు కష్టం వస్తే మావెంట ఎవరుంటారు..? అని ప్రశ్నించారు. మాకెందుకులే అని పట్టింపులేని తత్వం మంచిది కాదన్న కేటీఆర్... మనం మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలని కేటీఆర్‌ కోరారు.

ఇదీ చదవండీ... 'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details