విశాఖలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా నేతృత్వంలో బంద్ చేపట్టారు. వ్యాపారసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సినిమాహాళ్లు స్వచ్ఛందంగా మూసేశారు. స్థానిక తెదేపా కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు.
గుంటూరు జిల్లా బాపట్లలో.. తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ వేగేశ్న నరేంద్రవర్మ ఆధ్వర్యంలో.. నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.