ఇదీ చదవండి:
'తప్పుచేయకుంటే.. సీఎం జగన్‌కు భయమెందుకు' - వైకాపాపై తెదేపా నేతలు మండిపాటు
చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకోవడంపై తెదేపా సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరంలో అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే సీఎం జగన్‌కు భయమెందుకని తెదేపా నేత కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై వైకాపా దాడికి పాల్పడటం హేయమైన చర్యగా యనమల రామకృష్ణుడు అభివర్ణించారు. గంటల తరబడి మాజీ సీఎంను ఎయిర్ పోర్టు వద్దే ఎలా నిలిపేస్తారని నిలదీశారు. పోలీసులున్నది చోద్యం చూడటానికి కాదని యనమల అన్నారు.
వైకాపాపై తెదేపా నేతలు మండిపాటు