ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరదల్లోనూ రాజకీయం చేస్తున్నారు: చినరాజప్ప - నిమ్మకాయల చినరాజప్ప తాజా వార్తలు

ఒకపక్క వరదలతో రాష్ట్ర ప్రజానీకం అల్లాడుతుంటే.. వైకాపా ప్రభుత్వం ఈ సమయంలోనూ రాజకీయాలు చేస్తోందని.. తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్రం కోసం ఎలాంటి ఆలోచన చేయడంలేదని మండిపడ్డారు.

nimmakayala chinarajappa
నిమ్మకాయల చినరాజప్ప

By

Published : Oct 18, 2020, 4:18 PM IST

తుఫానులు, వరదలు వచ్చినా.. ఈ ప్రభుత్వానికి రాజకీయం తప్ప రాష్ట్రం కోసం ఆలోచన లేదని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు ఇల్లుపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విశాఖలో తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

వరదలతో నష్టపోయిన రైతుల కోసం ఆలోచించడం లేదని.. కనీసం పంటలకు ఎంత నష్టం వచ్చిందో లెక్కలు వేయలేదని మండిపడ్డారు. వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయం అయితే.. ఒక్క కిలోమీటర్ రోడ్డు వేయలేదని విమర్శించారు. కరోనా కేసులు పెరుగుతున్నా.. నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details