ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... బైక్ ర్యాలీ అనుమతి విషయంలో పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. దీని వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఐదు రోజుల కిందటే అనుమతి తీసుకున్నామని చెప్పారు. నర్సీపట్నంలో తెదేపాను ఓడించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయి మాటలను నమ్మే స్థితిలో నర్సీపట్నం ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. నర్సీపట్నం అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
విజయసాయి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు: అయ్యన్నపాత్రుడు - tdp leader ayyanna patrudu
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో తెదేపాను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నర్సీపట్నం అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమన్నారు.
tdp leader ayyanna patrudu