వైకాపా విధ్వంస విధానాలతోనే విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో తెదేపా కార్యకర్త కాశీరాం బలవన్మరణానికి పాల్పడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలకు.. ఇంకా ఎంతమంది బలహీన వర్గాలవారు బలికావాలని నిలదీశారు. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వైకాపా నేతల దుశ్చర్యను ఆయన ఖండించారు.
'బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది'
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో వైకాపా విధ్వంస విధానాలతో.. తెదేపా కార్యకర్త కాశీరాం ఆత్మహత్యకు పాల్పడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అతని మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
'బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది'
వైకాపా నేతలు పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక.. అడ్డదారులు తొక్కుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. కాశీరాం మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.