ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ మీదుగా ప్రత్యేక రైళ్లు - Special trains over Visakhapatnam

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Special trains over Visakhapatnam
విశాఖ మీదుగా ప్రత్యేక రైళ్లు

By

Published : Nov 24, 2020, 12:04 PM IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 23 నుంచి ప్రతి సోమ, మంగళవారాల్లో ఎర్నాకుళం-పట్నా(02643) ప్రత్యేక రైలు, ఈ నెల 26 నుంచి గురు, శుక్రవారాల్లో పట్నా-ఎర్నాకుళం(02644) బై వీక్లీ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఈ నెల 22 నుంచి ప్రతి ఆదివారం నాగర్‌కోయిల్‌-షాలిమార్‌(02659), ఈ నెల 25 నుంచి ప్రతి బుధవారం షాలిమార్‌-నాగర్‌కోయిల్‌ (02660) ప్రత్యేక రైళ్లు, ఈ నెల 28 నుంచి ప్రతి గురు, శనివారాల్లో త్రివేండ్రం-షాలిమార్‌(02641) బై వీక్లీ ప్రత్యేక రైలు, డిసెంబర్‌ 1 నుంచి ప్రతి ఆది, మంగళవారాల్లో షాలిమార్‌-త్రివేండ్రం(02642) రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఈ రైళ్లు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బరంపురం, బలుగాన్‌, ఖుర్ధారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, జాజ్‌పూర్‌ కె.రోడ్‌, భద్రక్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.

ఇదీ చదవండి:

ఉద్యోగాల పేరుతో మోసం... రూ. 50 లక్షల మాయం

ABOUT THE AUTHOR

...view details