ఇదీ చదవండి:
'చంద్రబాబును అడ్డుకున్న వారు పెయిడ్ ఆర్టిస్టులే' - చంద్రబాబు విశాఖ పర్యటన
విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును అడ్డుకున్నవాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులేనని ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్లకుండా ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ.. వైకాపా నేతల కనుసన్నల్లో నడవాల్సి రావడం దురదృష్టకరమని సోమిరెడ్డి ట్విటర్ వేదికగా ఆక్షేపించారు.
వైకాపాపై మండిపడ్డ సోమిరెడ్డి