ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SOLAR PANELS: ఔరా అనిపించేలా.. అద్భుత సౌర సౌధం - విశాఖ తాజా వార్తలు

SOLAR PANELS: విద్యుత్ కోతల దృష్ట్యా ఎక్కువ మంది సంప్రదాయేతర ఇంధన వనరులపై తమ చూపు మళ్లిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆలోచనలు చేస్తున్నారు. అయితే.. చాలా మంది భవనాలపై ఒకటి లేదా రెండు సోలార్‌ ప్యానల్స్‌ ఉండటం చూస్తుంటాం. కానీ దీనికి భిన్నంగా ఓ హోటల్ యజమాని మాత్రం అయిదు అంతస్థుల భవనానికి చుట్టూ అలంకరణగా ఉపయోగించారు. ఈయన ఆలోచనలో వ్యాపార సూత్రంతోపాటు పర్యావరణ హితం కూడా ఉంది. మరి అంత సుందరంగా తీర్చిదిద్దిన భవనాన్ని మీరూ చూసేయండి..

SOLAR PANELS
ఔరా అనిపించేలా.. అద్భుత సౌర సౌధం

By

Published : May 2, 2022, 4:40 PM IST

SOLAR PANELS: మంచి సెంటర్‌..! అందులోనూ వాణిజ్య భవనం...! ఎవరైనా ఏం ఆలోచిస్తారు. ఆకర్షణీయమైన అద్దాలతో హంగులు అద్దాలని భావిస్తారు. కానీ.. విశాఖ వాసి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. బహుళ అంతస్థుల భవనానికి.. సొంత విద్యుత్‌ అవసరాలు తీరేలా.. అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు వేశారు.

ఔరా అనిపించేలా.. అద్భుత సౌర సౌధం

విశాఖ గురుద్వారా కూడలిలో హోటల్‌ కోసం ఐదంతస్థుల భవనం నిర్మించారు ఓనర్ నారాయణ రావు. హోటల్‌ భవనాలకు ఎవరైనా ఆకర్షణీయమైన ఆద్దాలు అమరుస్తారు. కానీ ఈయన మాత్రం.. వినూత్నంగా సోలార్‌ ప్యానల్స్‌ బిగించారు.

ఈ బహుళ అంతస్తుల భవనానికి చుట్టూ.. అమర్చిన సోలార్‌ ప్యానళ్ల ద్వారా రోజుకు.. 70 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. హోటల్‌ అవసరాలకుపోనూ మిగతా కరెంట్‌ను విక్రయించేలా గ్రిడ్‌కు అనుసంధానించారు. ఇలా చేయడం వల్ల రెండు విధాలా ఉపయోగం అంటున్నారు నారాయణరావు. చుట్టూ సౌరఫలకలు అమర్చడంతో.. ఈ భవనం చూపరులనూ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి:మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదని.. దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details