సింహాచల దేవస్థానం నూతన ఈవో బాధ్యతల స్వీకరణ సింహాద్రి అప్పన్న దేవస్థానం నూతన ఈవోగా ఎమ్.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో రామచంద్ర మోహన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న కొత్త ఈవో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధ్యతల స్వీకరణ దస్త్రాలపై సంతకాలు చేశారు. నూతన ఈవోకు ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి :