ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనకాపల్లిలో ఘనంగా శూలాల ఉత్సవం - విశాఖ జిల్లా వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లి చిన రాజుపేటలో చౌడేశ్వరి సాంబశివుని ఆలయంలో శూలాల ఉత్సవం ఘనంగా జరిగింది. పరమ శివుని భక్తులు శూలాలు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. దీనిని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

అనకాపల్లిలో ఘనంగా శూలాల ఉత్సవం
అనకాపల్లిలో ఘనంగా శూలాల ఉత్సవం

By

Published : Dec 8, 2020, 1:46 PM IST

Updated : Dec 8, 2020, 6:44 PM IST

కార్తికమాసంలో శివారాధనను భక్తులు ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తారు. ఈ మాసంలో శివున్ని మెప్పించేందుకు దేవాంగులు ఒంటికి శూలాలు గుచ్చుకొని శివ తాండవం చేస్తారు. విశాఖ జిల్లా అనకాపల్లి చినరాజుపేటలో చౌడేశ్వరి సాంబశివుని ఆలయంలో ఘనంగా జరిగిన ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. 20 మంది వరకు భక్తులు ఒంటికి శూలాలుగుచ్చుకొని శివ తాండవం చేస్తూ అనకాపల్లి పట్టణ పురవీధుల్లో ప్రదర్శన జరిపారు. ప్రతి ఏడాది కార్తిక మాసంలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని...ఈ సారి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిపారు. దేవాంగులు కులానికి చెందిన భక్తులు శూలాలు శరీరానికి గుచ్చుకొని ప్రదర్శన చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు స్వామికి మొక్కుకున్న భక్తులు కూడా శూలాలు ఒంటికి గుచ్చుకొని శివతాండవం చేస్తారు.

Last Updated : Dec 8, 2020, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details