విశాఖ జిల్లా గిరిపుత్రుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏ చిన్న రోగం వచ్చినా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే వారు పడే బాధలు వర్ణనాతీతం. తాజాగా వడ్డాది మాడుగుల మండలం కొత్త వలస గ్రామానికి చెందిన నిండుగర్భిణిని డోలీ కట్టి ఆసుపత్రికి తరలించారు. సమారు 15 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తరలించేందుకు... రాళ్లు రప్పలు, కొండ కోనలు దాటుకుంటూ ఐదు కిలోమీటర్ల వరకు డోలీలోనే తీసుకువెళ్లారు. అనంతరం తాటిపర్తి సెంటర్ నుంచి ఆటో ద్వారా కేజేపురం ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులు క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గర్భిణీకి డోలీ కష్టాలు.... 5 కిలోమీటర్ల పయనం... - VISHAKHA
విశాఖ జిల్లా మైదాన ప్రాంతంలో రహదారి సౌలభ్యం సరిగా లేక డోలీ మోత కష్టాలు తప్పడం లేదు. ఉన్న కాస్తో కూస్తో మట్టి రోడ్డు సైతం వర్షాలకు బురదమయం అవ్వటం వల్ల నానా ఇబ్బందులకు గురవుతున్నారు. నొప్పులతో బాధపడుతున్న వి.మాడుగుల మండలం కొత్తవలసకు చెందిన గర్భిణిని వైద్యం కోసం 5కిలోమీటర్లు డోలీలో తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ గిరిపుత్రుల డోలి కష్టాలు