లారీ స్టాండ్ ను ప్రారంభించిన పోర్టు చైర్మన్ కార్మికులు,ఉద్యోగులు సంస్థ అభ్యున్నతి కోసం పాటుపడాలని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు కోరారు. పోర్టు పరిధిలో పనిచేసే లారీ యజమానులు, లారీ డ్రైవర్లు తో పాటు ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పని చేయడం వల్లే సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తోంది అని ప్రశంసించారు.లారీలు నిలిపేందుకు సువిశాలమైన స్టాండ్‌ను ఆయన ప్రారంభించారు.వర్షాకాలం వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా లారీ ట్రాక్ ను గట్టిగా తయారు చేయించామన్నారు.