విశాఖ పరవాడ ఫార్మాసిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే కారణమని రాజకీయ నేతలు ఆరోపించారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, జనసేన, భాజపా నేతలను పరిశ్రమ సమీపంలోకి వెళ్లకుండా పోలీసులు అదుపులోకి తీసుకుని, సమీప పోలీసు స్టేషన్ కు తరిలించారు.
ఎవరిది బాధ్యత?
ప్రమాదం జరిగిన తీరును ఇంతవరకూ ఏ అధికారి వివరాలు చెప్పలేదని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన సీనియర్ కెమిస్ట్ గురించి కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని రాజకీయ పక్ష నేతలు తప్పుబట్టారు. ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.