విశాఖలో జనసేన బహిరంగ సభకు పోలీసుల అనుమతి
19:58 October 29
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ బహిరంగ సభ
విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన నిర్వహించనున్న బహిరంగసభకు విశాఖ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 31న విశాఖలో బహిరంగ సభ పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మొదట పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసైనికులు స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద టెంట్ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. జనసైనికుల నిరసనతో.. బహిరంగసభకు విశాఖ పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
ఇదీ చదవండి:chandrababu : న్యాయానికి తలొగ్గుతాం.. దుర్మార్గానికి ఎదురొడ్డుతాం: చంద్రబాబు
TAGGED:
jansena meeting at vsp