విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో దారుణం జరిగింది. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి జెర్రిపోతుల సముద్రాల, పార్వతి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను హత్య చేసి... ఇంట్లోని నగదు, వస్తువులు దోచుకెళ్లారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ స్వరూపారాణి పరిశీలించారు. ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
దారుణం.. విశాఖ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య - vizag crime news
విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి.. నగదు, వస్తువులు దోచుకెళ్లారు.
దారుణం.. విశాఖ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య
Last Updated : Feb 27, 2020, 10:43 AM IST