సాగర నగరం విశాఖలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కొవిడ్ నిబంధనల్ని పాటించాల్సిందిగా పోలీసులు చేసిన విజ్ఞప్తికి.. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఏటా ఎంతో రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయంలో.. విశాఖ సాగర తీరంలో ఇసుక వేస్తే రాలనంత స్థాయిలో ప్రజల సందడి ఏటా ఉండేది. అందుకు భిన్నంగా ఈసారి బీచ్ రోడ్డు పూర్తి ఖాళీగా దర్శనమిచ్చింది. ప్రజలు బాధ్యతగా వ్యవహరించారని విశాఖ నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సంతృప్తి వ్యక్తం చేశారు.