ఆదివాసీల జీవనశైలి దెబ్బ తినకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రికి స్వాత్మానందేంద్ర విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో విశాఖ శారదాపీఠం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి గిరిజనులంటే మక్కువ ఎక్కువని తెలిపారు. గోరక్షణ చర్యల్లో భాగంగా గిరిజనులకు గోవులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ జాతుల మనుగడ కోల్పోకుండా ప్రత్యేక చట్టాలు రూపొందించాలని మంత్రికి స్వామీజీ సూచించారు.
ఇదీ చదవండి: