రాష్ట్రంలో ఈ 9 నెలల్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదని... జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్ధిని వెనక్కు తీసుకుని వెళ్లారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి, భూదందాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర రెవెన్యూ పడిపోయిందన్న నాదెండ్ల మనోహర్... రాష్ట్రాభివృద్ధి కోసమే భాజపాతో కలిసి జనసేన పనిచేస్తోందని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల రంగులు మార్చారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
'ఈ 9 నెలల్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు' - నాదెండ్ల మనోహర్
రాజకీయ లబ్ధి, భూదందాల కోసమే వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని... జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే భాజపాతో కలిసి జనసేన పనిచేస్తోందని స్పష్టం చేశారు. గతంలో తెదేపా చేసిన తప్పులే ఇప్పుడు వైకాపా చేస్తోందని విమర్శించారు.
కేంద్రం నుంచి ఓ ఆసక్తి కరమైన అంశం బయట పడిందని పేర్కొన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేకపోయిన కారణంగా... వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చే నిధులు వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. పేదల, విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల స్థలాలు లాక్కొని పేదలకు ఇస్తామనడం దారుణమని వ్యాఖ్యానించారు. ఉగాది నుంచి జనసేన, భాజపా కలిసి ప్రజా సమస్యలపై పోరాడతాయని పేర్కొన్నారు. గతంలో తెదేపా చేసిన తప్పులే ఇప్పుడు వైకాపా చేస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండీ... ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు బహిరంగ లేఖ