పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి విశాఖ జిల్లాకు వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి ఘనస్వాగతం లభించింది. విశాఖపట్నంలోని ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ముత్తంశెట్టి పాల్గొన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు, కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. పార్టీని నమ్ముకుని పని చేసిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని మంత్రి ముత్తంశెట్టి హామీ ఇచ్చారు. జిల్లాలోని 15నియోజకవర్గాల ప్రజల సమస్యల పరిష్కారాని కృషిచేస్తానని మంత్రి పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తా - minister avanthi
జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తానని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ... జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని హామీఇచ్చారు.
ముత్తంశెట్టి శ్రీనివాసరావు