విశాఖకు రైల్వే జోన్ ప్రతిపాదిత అంశాల్లో కేంద్రంతో నిర్దుష్టంగా వ్యవహరిస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఆదాయాన్నిచ్చే కొత్తవలస-కోరాపుట్ లైన్ను మరో జోన్లో కలపడం కారణంగా... రాష్ట్రానికి ప్రత్యేక జోన్ ఫలితం దక్కదని అభిప్రాయపడ్డారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు చేస్తామని చెప్పారు. విశాఖ ప్రజలకు రైల్వే కష్టాలు తొలగించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై ప్రజాప్రతినిధులతో చర్చించారు.
'విశాఖ రైల్వే కష్టాలు తొలగించేందుకు ప్రయత్నాలు' - mp vijayasai reddy
ఆదాయాన్నిచ్చే కొత్తవలస-కోరాపుట్ లైన్ను మరో జోన్లో కలపడం కారణంగా... రాష్ట్రానికి ప్రత్యేక జోన్ ఫలితం దక్కదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
విజయసాయి రెడ్డి