ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దారుణం: కుమారుడిని హత్యచేసిన తల్లి - Mother Killed Son news

విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. మారికవలస న్యూ కాలనీలో కన్న కొడుకునే హత్య చేసిందొక తల్లి. వివరాల్లోకి వెళితే..

mother-killed-son-in-visakha-madhuravada
విశాఖలో కుమారుడిని హత్యచేసిన తల్లి

By

Published : Oct 26, 2020, 2:32 PM IST

చెడువ్యసనాలకు బానిసైన కుమారుడిని ఓ తల్లి కడతేర్చింది. ఈ ఘటన విశాఖ జిల్లా మధురవాడలో చోటుచేసుకుంది. పీఎం పాలెం సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం.. మధురవాడలోని మారికవలస న్యూకాలనీలో బ్లాక్‌ నెం144, ఎస్‌ఎఫ్‌3లో కోట్ల శ్రీను, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అనిల్‌(18)తో పాటు కుమార్తె ఉన్నారు.

సీఐ రవికుమార్‌

గత కొంతకాలం నుంచి అనిల్‌ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులివ్వమని తల్లిదండ్రులను రోజూ వేధిస్తున్నాడు. ప్రతీరోజూ బయట వ్యక్తులతో గొడవపడటంతోపాటు తల్లిదండ్రులపైనా భౌతికదాడులకు దిగుతున్నాడు. దీంతో విసిగిపోయి ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్‌ ఛాతీపై తల్లి మాధవి గ్యాస్‌సిలిండర్‌తో కొట్టి హత్య చేసింది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details