విశాఖ జిల్లా మరికవలసలో తల్లీ, కొడుకు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. సరిత (35). చేతన్ (3) బ్లాక్ నెంబర్ 57లో నివాసం ఉంటున్నారు. తల్లీ, కుమారుడు వేరువేరు గదుల్లో మృతి చెందడం.. మృతురాలి చేతిపై గాయలుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది హత్యా.. ఆత్మహత్య అంతుచిక్కడం లేదని స్థానికులు చెబుతున్నారు. పియమ్ పాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
తల్లి ఓ గదిలో .. మూడేళ్ల కుమారుడు మరో గదిలో.. అసలేం జరిగింది..? - మరివలసలో తల్లికుమారుడు మృతి
తల్లి, మూడేళ్ల కుమారుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా మరికవలసలో జరిగింది. మృతురాలి చేతిపై గాయాలుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరికవలసలో తల్లి కొడుకు అనుమానస్పద స్థితిలో మృతి