వేసవి సమీపిస్తోన్న వేళ నగరంలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి లభ్యత, ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ, తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. విశాఖలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. విశాఖలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలి, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, లభ్యతపై అధికారులతో మంత్రి చర్చించారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు భూ సమీకరణ, లబ్ధిదారుల ఎంపికపై 4 జిల్లాల మున్సిపల్ కమిషనర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
'తాగునీటి సరఫరా సమస్యలను ఎలా అధిగమిద్దాం..?'
విశాఖలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి బొత్స సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో అధికారులు సమీక్షకు హాజరయ్యారు. వేసవిలో తాగునీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి లభ్యతపై చర్చించారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ, బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్, క్రమబద్ధీకరణలపై అధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు.
మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ