విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారు ఎంతటి వారైనా సీఎం జగన్ ఉపేక్షించరని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ విమ్స్‌లో కొవిడ్ టీకా పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజాసంక్షేమం, అభివృద్ధి పేరుతో వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న తీరును చూసి ఓర్వలేని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రామతీర్థం రాని చంద్రబాబు... ఇవాళ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.
నిందితులు ఎంతటి వారైనా సీఎం జగన్ ఉపేక్షించరు: మంత్రి అవంతి - ఏపీలో ఆలయాలపై దాడులు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
చంద్రబాబుపై మంత్రి అవంతి ఫైర్