NEW DISTRICTS: రాష్ట్రంలో 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో, అదే తరహాలో మూడు రాజధానులూ వస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు మరింత చేరువ కానున్నాయన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాల పునర్విభజన చరిత్రాత్మకం, అభివృద్ధి దాయకమన్నారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారని, చర్చల ద్వారా పీఆర్సీ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. భీమిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజనపై కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించే అంశాలను తెరపైకి తేవడం బాధాకరమన్నారు. తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా విభజించి అధికార వికేంద్రీకరణ చేశారని గుర్తుచేశారు. భాజపా సైతం జిల్లాల విభజనను స్వాగతించిందని పేర్కొన్నారు. ఒక్క చంద్రబాబు తప్పా అంతా అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని భావించడం సరికాదన్నారు.
NEW DISTRICTS: 26 జిల్లాలొస్తున్నట్టే.. 3 రాజధానులొస్తాయి: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు - minister avanthi srinivas new districts
NEW DISTRICTS: రాష్ట్రంలో 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో, అదే తరహాలో మూడు రాజధానులూ వస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు మరింత చేరువ కానున్నాయన్నారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు