తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. మాటలతో ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. విశాఖకు చాలా చేస్తామని చెప్పి...కనీసం ఏం చేయలేదని ఆరోపించారు. ఉన్న డబ్బులన్నీ అమరావతికి ఖర్చు చేసి మిగతా పథకాలను అన్నీ పక్కన పెట్టారని దుయ్యబట్టారు. రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తున్న తెదేపా....విశాఖలో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. వారిలో ఒక్క శాసన సభ్యుడు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఒక్క ఎమ్మెల్యే గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: అవంతి - minister avanthi srinivas open challenge to tdp
అమరావతికి మద్దతుగా విశాఖపట్నంలో గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వారిలో ఒక్కరూ గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తెదేపా అధినేత చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు.
minister avanthi srinivas