చిట్టివలస జూట్ మిల్లు సమస్య పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. చిట్టివలస జూట్ మిల్లు మూతపడి దాదాపు పదేళ్లు కావస్తున్నా... ఇప్పటికీ సమస్య పరిష్కారం కాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వైకాపా అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే కార్మిక సంఘాలతో రెండుసార్లు సమావేశమయ్యామన్న అవంతి... శుక్రవారం మూడోసారి భేటీ అయినట్లు వివరించారు. ఈ సమావేశంలో లేబర్ కమిషనర్, జూట్ మిల్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. కార్మికులకు మేలు జరిగే విధంగా అన్ని సంఘాలు ప్రయత్నించాలని కోరారు. కార్మికులకు మేలు జరిగేందుకు ప్రభుత్వపరంగా తాను అన్ని విధాలా సహకారం అందిస్తానని హామీఇచ్చారు.
చిట్టివలస జూట్ మిల్లు సమస్య పరిష్కరిస్తా: అవంతి - ముత్తంశెట్టి శ్రీనివాసరావు
చిట్టివలస జూట్ మిల్లు సమస్య పరిష్కారానికి తాను ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం లేబర్ కమిషనర్, జూట్ మిల్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
చిట్టివలస జూట్ మిల్లు సమస్య పరిష్కరిస్తా: అవంతి