దమ్ముంటే తెదేపా ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే...ఆ పార్టీతో లేరని గుర్తు చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.... ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారినా అది కేవలం కేసుల నుంచి బయటపడటానికే అని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
తెదేపా ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలి: మంత్రి అవంతి
అసెంబ్లీ రద్దు చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ విసిరారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
minister avanthi srinivas