ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాకు కంపెనీ ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యం: మంత్రి అవంతి - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మాకు కంపెనీ ముఖ్యం కాదని...ప్రజలే ముఖ్యమని మంత్రి అన్నారు.

minister avanthi comments on lg industry issue
మంత్రి అవంతి శ్రీనివాస్

By

Published : May 9, 2020, 11:32 AM IST

Updated : May 9, 2020, 6:13 PM IST

ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని మంత్రి అవంతి పేర్కొన్నారు. వదంతులు నమ్మవద్దు.. ఆందోళనకు గురికావద్దని ఆయన సూచించారు. ఘటనాస్థలంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిందన్న మంత్రి...5 గ్రామాల ప్రజలు 48 గంటలపాటు పునరావాస కేంద్రాల్లో ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న 500 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిస్థితిని ఏడుగురు మంత్రులు సమీక్షిస్తున్నారన్న ఆయన... స్టైరిన్‌ వాయువును చాలా జాగ్రత్తలు తీసుకుని నియంత్రించాలని తెలిపారు. స్థానికులంతా మరో 2 రోజులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మాకు కంపెనీ ముఖ్యం కాదని..ప్రజలే ముఖ్యమని మంత్రి అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Last Updated : May 9, 2020, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details