ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ మెట్రోకు వచ్చే నెలలో టెండర్లు:బొత్స

పాలనా రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని చెప్పారు.

metro rail office started in vizag
విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం

By

Published : Oct 25, 2020, 4:01 PM IST

Updated : Oct 25, 2020, 6:59 PM IST

విశాఖ మెట్రోలో ప్రైవేటు భాగస్వామ్యమా? నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా? అనే విషయంపై సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స అన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.

Last Updated : Oct 25, 2020, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details