విశాఖ నూతన పోలీస్ కమిషనర్‌గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ఆర్కె మీనా డీజీపీ కార్యాలయానికి బదిలీ కావడంతో.. సిన్హాను విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ ఉదయం విశాఖ నగర పోలీస్ కమిషనరేట్‌లో ఆర్కె మీనా నుంచి మనీష్‌కుమార్ సిన్హా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల సీపీ ఆర్కే మీనా ఏడాది పదవీకాలం పూర్తిచేశారు. బదిలీపై వెళ్లనున్న సీపీ మీనాకు పలువురు పోలీసు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
విశాఖ సీపీగా మనీష్‌కుమార్ సిన్హా బాధ్యతల స్వీకరణ - vishakhapatnam news
విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా నియమితులైన మనీష్‌కుమార్ సిన్హా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ ఆర్కే మీనాను డీజీపీ కార్యాలయానికి బదిలీచేశారు. ఇంటిలిజెన్స్ ఐజీగా ఉన్న మనీష్‌కుమార్ సిన్హాకు విశాఖ సీపీగా నియమించిన సంగతి తెలిసిందే.
విశాఖ సీపీగా మనీష్‌కుమార్ సిన్హా బాధ్యతల స్వీకరణ
ఐపీఎస్ 2000 బ్యాచ్‌కు చెందిన మనీష్ కుమార్ సిన్హా కేంద్ర సీబీఐ, రాష్ట్ర ఇంటిలెజెంట్స్ విభాగంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేశారు. గతంలో ఉత్తరాంధ్రలో పోలీస్ అధికారిగా సేవలు అందించిన అనుభవం మనీష్ కుమార్ సిన్హాకు ఉంది.
ఇవీ చదవండి:విశాఖ సృష్టి ఆస్పత్రి కేసు.. 14 మంది అరెస్టు