బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు! - వాతావరణ శాఖ తాజా వార్తలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల పాటు వాయువ్యంగా అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!
అల్పపీడనం వాయువ్యం నుంచి ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని అంచనా. రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలో ఇవాళ విస్తారంగా వర్షం... ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.