'తలను తీసుకెళ్లి మొండాన్ని మిగిల్చారు'
ఆదాయాన్నిచ్చే వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీని మోసం చేసిందని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు
రైల్వే జోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభజన లాంటి అన్యాయమే జరిగిందని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం ఉన్న హైదరాబాద్‌ను తెలంగాణకుఇచ్చినట్లు.... ఇప్పుడు వేల కోట్ల ఆదాయాన్నిచ్చే వాల్తేరుడివిజన్నుఒడిశాకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నమో(నరేంద్ర మోదీ)' అంటే నమ్మించి మోసం చేసేవారని.... రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. బిడ్డలాంటి విశాఖ రైల్వేకు జన్మనిచ్చి.. తల్లి లాంటి వాల్తేర్ డివిజన్‌ని మోదీ గారు చంపేశారని విమర్శించారు. సరకు రవాణా ద్వారా ఏడాదికి 6,500 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే తల లాంటి వాల్తేరుడివిజనుతీసేసి, 500 కోట్ల రూపాయలు కూడా రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని మిగిల్చారని ప్రధాని మోదీపై ట్విటర్లో లోకేశ్ మండిపడ్డారు.