ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనవరి 8న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె: వామపక్షాలు - రాజధాని రగడ

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా వచ్చే జనవరిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు వామపక్షపార్టీల నేతలు తెలిపారు. అలాగే రాజధాని విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

left parties call for A nationwide general strike on January 8
వామపక్షాల పార్టీల నేతలు

By

Published : Dec 23, 2019, 5:51 PM IST

మీడియాతో సీపీఐ నేత సత్యనారాయణ మూర్తి

సీఏఏ, ఎన్ఆర్​సీ చట్టాలు దేశ ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ కళాభారతిలో వామపక్ష పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2020 జనవరి 8న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. ఈ సమ్మెకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

రాష్ట్రంలో రాజధానులను రియల్ ఎస్టేట్ రాజధానులుగా మారుస్తున్నారని సీపీఐ నేత సత్యనారాయణ మూర్తి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.

ఇదీ చదవండి:ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం: సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details