ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అరకు ఎమ్మెల్యే  కిడారి హత్యకేసు నిందితుడి అరెస్టు - araku

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమెల్యే సోమ హత్యకేసుతో సంబంధముందని భావిస్తున్న నిందితుణ్ణి ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎన్ఐఏకు అప్పగించనున్నారు.

కిడారి హత్యకేసు నిందితుడి అరెస్టు

By

Published : Apr 28, 2019, 12:42 PM IST

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసులో నిందితుడైన కిల్లో జయరాంను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోరాపుట్ కోర్టులో హాజరు పరిచారు. ఇతను గతంలో అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడని కోరాపుట్ ఎస్పీ కేవీ సింగ్ తెలిపారు. 2017 లో హతిబారి పంచాయతీ సర్పంచ్ హత్యతోపాటు, రహదారి నిర్మాణ యంత్రాల దహనం కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కోన్నారు. కిడారి, సోమ హత్య నేపథ్యంలో జయరాంను విచారణ నిమిత్తం కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

కిడారి హత్యకేసు నిందితుడి అరెస్టు
ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details