విశాఖలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ కట్టుబడి ఉన్నాయని ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఎపిక్ - 2020 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ నుంచి ఐటీ సంస్థలు తరలిపోతున్నాయనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలను ఐటీ కాన్సెప్ట్ సిటీలుగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని శశిధర్ వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, నాస్కామ్ ఆధ్వర్యంలో సెంటర్ అఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, పది రోజుల క్రితం దీనికి నిధులు విడుదల చేశామని తెలిపారు. ఇంకొక సెంటర్ అఫ్ ఎక్స్‌లెన్స్‌ను రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీల కోసం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
'విశాఖలోని ఐటీ సంస్థలు ఎక్కడికి వెళ్లడం లేదు' - కోన శశిధర్ వార్తలు
విశాఖ నుంచి ఐటీ సంస్థలు వెళ్లిపోతున్నాయనేది అసత్య ప్రచారమని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు. ఐటీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడు సిటీలను కాన్సెప్ట్ సిటీలుగా మార్చేందుకు సీఎం యోచిస్తున్నారని తెలిపారు.
kona sasidhar