మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు, ప్రజలు సహకరించాలని మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను జాతీయ మానవ హక్కుల సంఘం పరిశీలించిందన్నారు. తమ పరిశీలనలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్లు తేలిందన్నారు. దిశ నిందితులను పాయింట్ బ్లాంక్‌లో కాల్చినట్లు రాష్ట్ర కార్యదర్శి తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
'దిశ నిందితులను పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు'
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని మానవహక్కుల సంఘం విశాఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణలో దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని తమ పరిశీలనతో వెల్లడైనట్లు తెలిపారు.
'పాయింట్ బ్లాంక్‌లో వాళ్లని కాల్చారు'