కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున.. లోక కల్యాణం, ప్రజారోగ్యం కోసం ధన్వంతరి, సుదర్శన హోమాలు నిర్వహించాలని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి, ఈవో సూర్యకళ, అధికారులు నిర్ణయించారు.
ఈ నెల 24న ఆలయంలో హోమం నిర్వహించనున్నారు. అదేరోజు నిత్య కల్యాణం, స్వాతి నక్షత్ర హోమం కూడా ఉంటుది. ఆన్ లైన్లో రుసుము చెల్లించినవారి గోత్రనామాల పేరిట పూజలు చేయిస్తామని ఈవో చెప్పారు.